మధ్యప్రదేశ్లోని సిరోజం గ్రామంలో ఇటీవల ఆశ్చర్యకర ఘటన జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో ఓ యువకుడు ఎప్పటిలాగే తన గదిలోకి వెళ్లి, దుప్పటి కప్పుకుని నిద్రపోయాడు. అసలే చలికాలం, అప్పటికే అలిసిపోయి ఉండడంతో దుప్పటి కప్పగానే నిద్ర వచ్చేసింది. అయితే తెల్లవారి లేచిన తర్వాత ఏవో శబ్దాలు రావడంతో పక్కకు చూశాడు. దీంతో ఆ యువకుడి గుండె గుభేల్మంది. విషపూరితమైన నాగుపాము తన దుప్పట్లో దూరి రాత్రంతా నిద్రపోయిందని ఆలస్యంగా అతడికి అర్ధం అయింది. చివరికి స్నేక్ క్యాచర్ వచ్చి, ఆ పామును పట్టుకుని బయట విడిచి పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.