బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంతోపాటు పలు రకాల చికిత్సల్లో బెల్లాన్ని ఉపయోగిస్తారు. బెల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. శరీరంలో పోషకాల లోపం ఉన్నప్పుడు ఆహారంలో బెల్లం చేర్చుకోవడం మంచిది. దీనిద్వారా తక్షణ ప్రయోజనం లభిస్తుంది. వాస్తవానికి దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అలాగే, బెల్లం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. బీపీ అదుపులో లేని వారు తప్పనిసరిగా బెల్లం తినాలి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తపోటు అదుపులో ఉంటుంది.