పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్‌లో దారుణం జరిగింది. భర్త చనిపోవడంతో ఓ మహిళ పుట్టింట్లో ఉంటోంది. పెళ్లి పేరుతో ఆమెకు ఓ యువకుడు దగ్గరై, తర్వాత ముఖం చాటేశాడు. గొడవ పరిష్కరిస్తానని ఆమెను 3 నెలల క్రితం కౌన్సిలర్ ముఖేష్ పిలిచాడు. ఆమె ప్రియుడు, అతడి ఫ్రెండ్ కూడా పంచాయితీకి వచ్చారు. ఆ మహిళపై కౌన్సిలర్‌తో సహా ముగ్గురు అత్యాచారం చేశారు. జిల్లా ఎస్పీకి బాధితురాలు తాజాగా ఫిర్యాదు చేసింది.