షాలిమార్ ఎల్ టీటీ ఎక్స్ ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాశిక్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. రైలులోని లగేజ్ కంపార్ట్ మెంట్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం శనివారం ఉదయం 8.43 గంటలకు జరిగిందని, మంటలు ప్యాసెంజర్ భోగీలకు అంటుకోకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని సెంట్రల్ రైల్వే తెలిపింది.