గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం తులసీ ధాత్రి కల్యాణ ఉత్సవాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. క్షీరాబ్ది ద్వాదశి పర్వ దినం సందర్భంగా తులసీ కల్యా ణం నిర్వహించినట్లు వేదపండి తులు, అర్చకులు తెలిపారు. అనంతరం ఆలయంలోని శ్రీ సీతా రామలక్ష్మణ సహిత ఆంజనేయ స్వాముల ఉత్సవ మూర్తులను వెండి రథంపై ఆశీనులు గావించి ప్రాకారో త్సవం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.