కడప జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి యస్ కవిత ఆదివారం చిన్న చౌకు లో ఉన్న ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల నందు నల్సా మడ్యూల్ మెగా లీగల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి బాలల సంరక్షణ కొరకు స్నేహపూర్వక న్యాయ సేవలు పథకం 2015 గురించి వివరించారు. బాలల హక్కుల చట్టాలు, విద్యాహక్కు చట్టం, జువెనైల్ జస్టిస్ ఆక్ట్ గురించి వివరించారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, విద్యను అభ్యసించవలసిన వయసులో పిల్లలతో పని చేయించడం చట్టరీత్యా నేరమని అన్నారు. టోల్ ఫ్రీ నెంబర్లు అయినా 100, 1098 ల పట్ల అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్ వారు స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగినది. విద్యార్థినిలు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు స్టాల్స్ ను సందర్శించడం జరిగినది. స్టాల్స్ లో ప్రదర్శించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు వివిధ శాఖలకు చెందిన కరపత్రాలను పంచిపెట్టడం జరిగినది.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కడప శ్రీనివాస్, డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సునీత, చైర్ పర్సన్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ డాక్టర్ వివి సాంబశివరావు, రిహాబిలిటేషన్ ఆఫీసర్ డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎం శ్రీకాంత్, వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అశ్విని, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీలు, బాలికల గురుకుల పాఠశాల డిస్టిక్ కో ఆర్డినేటర్ సుకన్య, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అచ్చయ్య, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది, డొమెస్టిక్ వైలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.