ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ సంచలన ఆరోపణలు చేశారు. హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ రెబల్ అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి తెచ్చారన్నారు. సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వీడియోను ఆదివారం మీడియా సమావేశంలో ప్రస్తావించారు. నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికలను అధికార బలం ఉపయోగించి ప్రభావితం చేస్తున్నార్నారు. పాలన కంటే ఎన్నికల ప్రచారమే ఎక్కువై పోయిందంటూ విమర్శించారు.