శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసం రెండవ సోమవారం మరియు పౌర్ణమి ఒకే రోజు కలిసి రావడంతో సూర్యలంక సముద్ర తీరాన అయ్యప్ప స్వాములు దీపారాధన చేశారు. తెల్లవారుజాము నుండే భారీగా తరలివచ్చిన అయ్యప్ప స్వాములు దీపారాధన చేసి సముద్రుడికి హారతి ఇచ్చారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి దీపారాధన చేసి దీపాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.