ఒంటేరు గెలుపు ఎయిడెడ్ ఉపాధ్యాయ ఉద్యోగుల మలుపు అని ఎయిడెడ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు త్రివిక్రమ్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరు స్థానిక గీతాశ్రమం వీధి గౌరీ శంకర్ జూనియర్ కళాశాలలో ఆదివారం ఎయిడెడ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారి ఆత్మీయ సభ జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన త్రివిక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వం పదవి విరమణ వయస్సు 58 నుంచి 60 కి పెంచినప్పుడు అది ఎయిడెడ్ సంస్థలకు వర్తింప చేయడంలో కృషి చేశారన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒంటేరు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఎయిడెడ్ నుండి ప్రభుత్వంలోనికి విలీనమైన ఉపాధ్యాయులకు వెంటనే సర్వీస్ రూల్స్ , ఏ. పీ. జి. ఎల్. ఐ, జి. పి. ఎఫ్, 2004 ఏడాది అనంతరం ఉద్యోగంలో చేరిన వారికి పెన్షన్ వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగభూషణ్ రెడ్డి, కోశాధికారి సింగరయ్య, దన్మయి ఎయిడెడ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ డిగ్రీ కళాశాల నాయకులు రమణ, శివరామిరెడ్డి, డానరసింహారెడ్డి, డా. మధుసూదన్ బాబు, డా. కూరపాటి శ్రీనివాసులరెడ్డి, పి. డి అసోసియేషన్ నాయకులు వెంకటరెడ్డి, కోటా ఓబులరెడ్డి, కొండారెడ్డి, ప్రధానోపాధ్యాయులు రవిప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.