సమాజాన్ని చైతన్యపరిచే సాధనంగా ఉన్న కళా రంగానికి నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం విస్మరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్ర నాయక్ తప్పుపట్టారు. సోమవారం స్థానిక శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కళారంగా అభివృద్ధి కోసం ఏమాత్రం నిధులు కేటాయించకపోవడం రాష్ట్రంలో ఉన్న జానపద గ్రామీణ కళల పరిరక్షణ కోసం ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆదరణ కళారంగానికి లేనందువల్ల అనేక జానపద గ్రామీణ కళలు కనుమరుగైపోతున్నాయి అన్నారు.
గత ప్రభుత్వాలు కొంతమేరకైనా కళారంగానికి బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగేదని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కళా రంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు సాంస్కృతిక శాఖ వెలవెలబోతుందన్నారు. ఇప్పటికైనా కళారంగానికి సముచితమైన నిధులు కేటాయించి సాంస్కృతిక రంగాన్ని కాపాడాలని ప్రజానాట్యమండలి డిమాండ్ చేస్తుంది అన్నారు అలాగే గతంలో కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన కళాకారుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రస్తుతం కళాకారులకు ఇస్తున్న 3000 పెన్షన్ 5000 రూపాయలకు పెంచాలని అనేక నాటక సమాజాలను ప్రోత్సహించడానికి బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉన్న కళాకారులందరికి గుర్తింపు కార్డులు ఇవ్వడంతో పాటు వారి అభివృద్ధి కోసం సంక్షేమ కార్యకలాపాలు కొనసాగించడం ద్వారా కళాకారులు సమాజాభివృద్ధి కోసం తమ కలల ద్వారా కృషి చేస్తారని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు మహంతి లక్ష్మణరావు కోనసీమ జిల్లా ప్రజానాట్యమండలి కార్యదర్శి సామెల్ పాల్గొన్నారు.