డబ్ల్యూటీఏ సెమీఫైనల్ పోరులో అరీనా సబలెంకా ప్రపంచ నంబర్ 1 ఇగా స్వియాటెక్ను మట్టికరిపించింది. దాదాపు రెండు గంటల పైగా సాగిన ఈ పోరులో అరీనా 6-2, 2-6, 6-1తో ఇగా స్వియాటెక్ను ఓడించింది. ఇక ఆదివారం డబ్ల్యూటీఏ ఫైనల్స్ లో కరోలిన్ గార్సియాతో అరీనా సబలెంకా తలపడనుంది. సెమీఫైనల్ విజయాలతో సబలెంకా, గార్సియా ఇద్దరూ ఈ సంవత్సరాన్ని టాప్ 5 లో ముగిస్తారు.