పాలకొండ ఉత్తరాంధ్ర ఆరాధ్యదైవమైన శ్రీ కోట దుర్గమ్మ తల్లి దేవాలయంను మంగళవారం నాడు చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8 గంటల నుంచి మూసివేస్తునట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి వి. రాధాకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలయాన్ని మరుసటి రోజు ఉదయం గ్రహణ శుద్ధి, స్నపనము మరియు హోమం అనంతరం ఉదయం 6 గంటల తర్వాత అమ్మవారి దర్శనాలకు అనుమతి ఇస్తామని ఆయన అన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.