కార్తీక పౌర్ణమి సందర్భంగా, విజయవాడ వన్ టౌన్ పాత శివాలయంలో పరమేశ్వరున్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో మేల తాళాలతో మంగళ వాయిద్యాలతో పీఠాధిపతికి ఆలయ అర్చక స్వాములు, అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనాంతరం భ్రమరాంబ అమ్మవారిని, అయ్యప్ప స్వామిని స్వామీజీ దర్శించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులచేత వేద ఆశీర్వచనం పొందారు. వన్ టౌన్ పాత శివాలయం ఈవో హేమలత స్వామి వారి శేష వస్త్రాలను స్వామీజీకి అందించారు.