గుజరాత్ లోని మోర్బీ బ్రిడ్జి కూలిపోయి 134 మంది మరణించిన ఘటనను ఆ రాష్ట్ర హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. దీపావళి సెలవుల అనంతరం నేడు తెరుచుకున్న హైకోర్టు బ్రిడ్జి ఘటనపై వారం రోజుల్లోగా రిపోర్టు అందజేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపింది. హోంశాఖ, మున్సిపల్ కమిషనర్, హ్యూమర్ రైట్స్ తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.