అగ్రవర్ణ పేదల(ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్ రాజ్యాంగంలోని సామాజిక న్యాయానికి పూర్తి వ్యతిరేకమని తమిళనాడు సీఎం స్టాలిన్ అభిప్రాయపడ్డారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సుప్రీం కోర్టు సమర్థించడాన్ని ఆయన తప్పుపట్టారు. సుప్రీం తీర్పుపై న్యాయ నిపుణులను సంప్రదించి.. తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు తమిళనాడులోని రాజకీయపార్టీలు కలిసి రావాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.