వలస వెళ్తున్న 306 మంది శ్రీలంక ప్రజలు దక్షిణ చైనా సముద్రంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వియత్నాం-ఫిలిప్పీన్స్ మధ్య నడిసంద్రంలో తాము చిక్కుకున్నట్లు తమిళనాడులోని బంధువులకు వారు సోమవారం ఫోన్ చేశారు. 30 మంది చిన్నారులతో సహా పలువురు గల్లంతు అయ్యారని వారు వాపోయారు. అయితే సిగ్నల్ కట్ అవడం, ఫోన్ కాల్ చివర్లో వారు హాహాకారాలు చేయడంతో అంతా గల్లంతు అయ్యారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.