స్పందన అర్జీలను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరిస్తామని తిరుపతి మునిసిపల్ అదనపు కమిషనర్ సునీత పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు తెలుకున్నారు. కార్య క్రమంలో డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు.