కార్తీక పౌర్ణమి సందర్భంగా బాపట్ల సూర్యలంక సముద్రతీరం నందు సముద్రుడికి శాసనసభ్యులు కోన రఘుపతి హారతి ఇచ్చారు. తెల్లవారుజామునే అఖండ జ్యోతి వెలిగించిన కోన రఘుపతి దంపతులు సముద్ర హారతి నిర్వహించారు. కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సముద్ర స్నానం ఆచరించేందుకు జిల్లా నలుమూలల నుండి భారీ స్థాయిలో పర్యాటకులు, భక్తులు సూర్యలంకకు చేరుకున్నారు. అధికారులు ముందస్తు ఏర్పాటు చేశారు.