హోటళ్ల నిర్వాహకులు డస్ట్ బిన్లు ఉంచుకుని టీ కప్పులు అందులో వేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న యజమాను లకు సూచించారు. మంగళవారం గుంతకల్లు పట్టణంలోని 10వ వార్డు రాయల్ సర్కిల్ కార్మికులు చేస్తున్న పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. అక్కడ హోటళ్ల వద్ద టీ కప్పులు పడిఉండడాన్ని గమనించి ప్రజలు టీ తగిన తర్వాత వాటిని డస్ట్ బిన్స్ లో వేసేలా చూడాలని హోటల్ నిర్వహ కుడికి సూచించారు. అనంతరం 12వ వార్డులోని కథల వీధిలో పర్యటించి కుళాయిలకు వస్తున్న తాగునీటిని పరిశీలించి నీరు వృధా చేయరాదని ప్రజలకు సూచించారు. ఆయనతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు.