మహారాష్ట్రలోని రాయఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షాపై ఇసుక నింపిన డంపర్ బోల్తా పడటంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో పరీక్ష ముగించుకొని ఇంటికి వెళ్తున్న ముగ్గురు విద్యార్థులతో పాటు ఆటో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షలు నష్టపరిహారం ఇస్తామని మంత్రి ఉదయ్ సమంత్ తెలిపారు.