తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో దారుణం జరిగింది. అమృతలింగం, చిత్ర దంపతులు తిరుపూర్‌లోని సెల్లం నగర్లో నివసిస్తున్నారు. చిత్రకు సినిమాలలో నటించాలనే ఆసక్తి ఉంది. ఇన్‌స్టా రీల్స్ చేస్తూ ఎక్కువ సమయం ఫోన్‌తో ఉండేది. భర్తను పట్టించుకోవడం మానేయడంతో ఇద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరికీ పెద్ద గొడవైంది. పట్టరాని కోపంతో భార్య గొంతు కోసి అమృతలింగం చంపేశాడు. ఆ తర్వాత పరారయ్యాడు.