ఒంగోలు: నగర వైసీపీ పార్టీ అధ్యక్షులు సింగరాజు వెంకటరాజు అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యానికి గురైన సింగరాజు వెంకటరాజు గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు, నాయకులు కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు.