టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది. టీమ్ ఇండియాలో ముఖ్యంగా విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. అద్భుతమైన ఫామ్‌తో ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన సూర్య.. ఈ మెగా టోర్నీలోనూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సూపర్-12 దశ చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై ధనాధన్ ఇన్నింగ్స్ సాధించాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్‌ల్లో అతను ఆడిన ఇన్నింగ్స్‌లు ఆ మ్యాచ్‌ల్లో హైలైట్‌గా నిలిచాయి. ఈ టోర్నీలో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడిన సూర్య 225 పరుగులు చేసి టాస్ స్కోరర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. ఇంత అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సూర్య తాజాగా టీ20లో ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా అవతరించిన సంగతి తెలిసిందే.
ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌తో పాటు విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా కేఎల్ రాహుల్ కూడా ఫామ్ అందుకున్నాడు. ఈ క్రమంలో గ్రూప్ దశలో గత రెండు మ్యాచ్ ల్లో అద్భుత విజయాలు సాధించిన టీమ్ ఇండియా.. గ్రూప్-2 టాపర్ గా సెమీస్ లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో సెమీఫైనల్లో ఇంగ్లండ్ తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ చాలా కీలకం. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌పై పొట్టి ఫార్మాట్‌లో సూర్య తొలి సెంచరీ సాధించడం గమనార్హం. మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. సూర్యను అడ్డుకుంటామని భావిస్తున్నా. 'సూర్య అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను ఆడే కొన్ని షాట్లు చూస్తే బుర్ర గోక్కోవడం తప్పితే ఏం చెయ్యలేం. అయితే గురువారం అతడిని అడ్డుకోగలమని, మనపై దాడి చేయకుండా అడ్డుకోగలమని ఆశిస్తున్నా' అని బెన్ స్టోక్స్ అన్నాడు.