భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల భోగాపురం మండలం పోలిపిల్లి గ్రామానికి చెందిన ఒక వివాహిత అదృశ్యం పై స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి. పోలిపల్లి గొల్లవీధికి చెందిన రమేష్ భార్య తగరపువలస లో గల ఒక కళాశాలలో డిగ్రీ చదువుకుంటుంది. అయితే ఆమె ఇంటికి రాకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నట్లు భర్త రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఎ. ఎస్.ఐ సత్తిబాబు దర్యాప్తు చేస్తున్నారు.