శ్రీశైలం జలాశయం నీటిమట్టం సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి 879. 80 అడుగులు, నీటినిల్వ 187. 2790 టీఎంసీలుగా నమోదైంది. జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి 22, 221 క్యూసెక్కుల వరద వస్తోంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ 66. 200 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు.