మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపించటం సహజం. దీనికి కారణం అన్నంలోని గ్లూకోజు రక్తంలో వేగంగా కలవటమే. అన్నంతో విడుదలయ్యే మెలటోనిన్, సెరటోనిన్ హార్మోన్లు విశ్రాంతి, మత్తు భావనను కలిగిస్తాయి. దీనికి పరిష్కారంగా ప్రోటీన్ ఎక్కువుండే ఆహారం తినడం మంచిది. అన్నానికి బదులు జొన్న, సజ్జ, గోధుమ రొట్టెల్లో ఏదైనా తినొచ్చు. మాంసాహారులైతే కూరగాయలు, సలాడ్‌తో కలిపి చికెన్ తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది.