ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ఏపీకి కేంద్రం శుభవార్త తెలిపింది. రెవిన్యూ లోటు భర్తీ కింద రూ.879 కోట్లను కేంద్రం విడుదల చేసింది. ఇప్పటికే కేంద్రం ఏపీకీ పలు దఫాలుగా రెవిన్యూ లోటు నిధులను విడుదల చేసింది. తాజాగా 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిన కేంద్రం ఏపీకి రూ.879 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో కలిపి ఏపీకి ఈ ఏడాది రెవిన్యూ లోటు కింద రూ.7032 కోట్లను కేంద్రం విడుదల చేసింది.