త్రిపురలోని అగర్తలాలో ఓ దుకాణ యజమాని కర్కశంగా ప్రవర్తించాడు. అపు సాహా అనే వ్యక్తికి గార్మెంట్ షాపు ఉంది. అందులో సూరజిత్ త్రిపుర అనే యువకుడు పని చేసేవాడు. ఇటీవలే అతడు పని మానేశాడు. అయితే తనకు గత నెల జీతం ఇవ్వాలని ఇటీవల వెళ్లి అడిగాడు. దీంతో యజమాని అపుసాహా ఆగ్రహంతో రగిలిపోయాడు. తన వద్ద పని చేసే సిబ్బందితో కలిసి సురజిత్పై ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. జరిగిన దారుణంపై వెస్ట్ అగర్తల పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.