పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ చినగంజాం మండలం మున్నంవారిపాలెంకు చెందిన ప్రేమజంట ఆట్ల సుబ్బారెడ్డి(25), అక్కల తేజ(17) లమృతదేహాలకు మంగళవారం సాయంత్రం చీరాల ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. ఆడివీదిపాలెం సమీపంలోని రొయ్యల చెరువుల వద్ద వారు పురుగుల మందు తాగి సోమవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడటం తెలిసిందే.
చినగంజాం ఎస్సై అనూక్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాస్పత్రికి మంగళవారం ఉదయం తరలించారు. పోస్టుమార్టంపోలీసులు ఇతర లాంఛనాలు పూర్తిచేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు.