రాష్ట్రంలోని క్రిస్టియన్లు ఓట్లు వేసి జగన్ మోహన్ రెడ్డికి అధికారం కట్టబెడితే వారిని పూర్తిగా విస్మరించారని క్రిస్టియన్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్ ఆరోపించారు. మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కంటితుడుపు చర్యగా కొంతమంది పాస్టర్లకు మేలు చేసి పెళ్లికానుక, విదేశీ విద్య, మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ తదితర పథకాలు అమలు చేయకుండా నీరుగార్చారన్నారు. జెరూసెలం యాత్ర, నూతన చర్చిల కట్టడాలు, పెళ్లికానుక తెలుగుదేశం పార్టీ ఇచ్చిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. అన్ని వర్గాలకు మేలు జరగాలంటే సీఎంగా చంద్రబాబునాయుడు రావాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నగర ప్రధాన కార్యదర్శి జయ కుమార్, నాయకులు వరప్రసాద్, సెలాస్టిస్, వాణి, ప్రభాకర్ పాల్గొన్నారు.