నిబంధనలు ఉల్లంఘించిన ఇద్దరు ఆటో డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డీవై స్వామి తెలిపారు. ములకలచెరువు మండలంలోని సోంపల్లెకు చెందిన ఇలియాజ్, కోనేటివారిపల్లె పంచాయతీకి చెందిన మధుసూదన్ అనే ఇద్దరు ఆటో డ్రైవర్లు ప్రయాణికులను తరలించే సమయంలో అతి వేగంతో వెళ్తూ, నిబంధనలు పాటించకుండా అజాగ్రత్తతో వాహనాలు నడుపుతున్నట్లు తెలిపారు. దీంతో వారిద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.