కాలక్షేపానికి చాలామంది చూయింగ్ గమ్ నములుతూ ఉంటారు. అయితే, చూయింగ్ గమ్ తో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. చూయింగ్ గమ్ నమలడం ద్వారా శ్వాసలో తాజాదనం లభించడంతోపాటు ముఖంలో ఉండే కండరాలు ఎక్సర్ సైజ్ అయ్యి గ్లో పెరుగుతుంది. అంతే కాకుండా, తరచుగా చూయింగ్ గమ్ నమిలేవారికి ఆకలి కాస్త తగ్గుతుంది. ముఖ్యంగా స్నాక్స్, చిరుతిళ్లకు లాంటి వాటికి దూరమవుతారు.