మెట్రో నిర్మాణం కోసం సంస్థ వివిధ బ్యాంకుల నుండి 13వేల కోట్ల రుణం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ భారం తగ్గించుకునేందుకు 50% వాటా అమ్మాలని సంస్థ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మెట్రో సంస్థకు ప్రభుత్వం కేటాయించిన 69 ఎకరాల భూమిని లీజుకిచ్చినా ఆశించిన మేర ఆదాయం రావడం లేదు. నష్టాల నుండి బయటపడటానికి చార్జీలు సైతం పెంచాలని మెట్రో చూస్తున్నట్లు సమాచారం.