కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. వేరే కులానికి చెందిన అబ్బాయితో తన కుమార్తె ప్రేమలో పడిందని ఓంకార్ గౌడ తెలుసుకున్నాడు. ప్రేమించొద్దని పలుమార్లు కుమార్తెను హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో అక్టోబర్ 31న తీసుకెళ్తానని నమ్మించి, కుడతిని పట్టణంలోని పెద్ద కాలువలో తోసేశాడు. బాలికకు ఈత రాకపోవడంతో అందులో మునిగి చనిపోయింది. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.