పిల్లలకు తల్లి పాలే శ్రేష్టం అని వైద్యులు చెబుతారు. సమాజంలో తల్లి పాలు అందని చిన్నారులు ఎందరో ఉన్నారు. అటువంటి చిన్నారులకు చనుబాలు దానం ఇస్తున్న సింధు మౌనిక అనే మహిళ ఎందరికో స్పూర్తిని ఇస్తోంది. కోయంబత్తూరు జిల్లా కన్యూర్ ఆమె స్వస్థలం. 'అమృతం థాయ్ పల్ దానం' సంస్థ ద్వారా ఆమె 10 నెలల్లో 55 లీటర్ల చనుబాలను సేకరించి, దానం ఇచ్చింది. ఆమెకు తాజాగా ఆసియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది.