జార్ఖండ్ రాష్ట్రంలోని దైగొట్టు గ్రామానికి చెందిన మాలతి సారాపై పోరాటం చేస్తున్నారు. ఆడవాళ్లపై గృహహింస ఆగాలంటే మగవాళ్లు తాగుడు మానాలని, సారాబట్టీలకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టింది. దీనిపై సారా బట్టీ యాజమానులు ఆమె భర్తను చంపేసినా పోరాటం ఆపలేదు. ఈమె పోరాటం ఫలితంగా ఆ ప్రాంతంలోని సారా బట్టీలన్నీ మూతబడ్డాయి.‘భానుమతి నీలకంఠన్ పురస్కారం’తో టాటా స్టీల్ ఫౌండేషన్ ఆమెను సత్కరించింది