తమిళనాడు విల్లుపురం జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. సిత్తామూర్ ప్రాంతానికి చెందిన శక్తివేల్ మద్యానికి బానిస అయ్యాడు. తన తల్లి యశోదతో తరచూ గొడవ పడేవాడు. బాగా తాగి వచ్చి మంగళవారం రాత్రి మరోసారి గొడవ పడ్డాడు. కోపంలో విచక్షణ కోల్పోయి తల్లిని దారుణంగా కొట్టాడు. ఆపై ఆమె ప్రాణంతో ఉండగానే గొయ్యి తీసి పూడ్చి పెట్టాడు. ఆమెను స్థానికులు బయటకు తీయగా, అప్పటికే చనిపోయింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.