వచ్చే ఏడాది జరిగే మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కు భారత్ ఆథిత్యమివ్వనున్నట్లు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ప్రకటించింది. ఈ మేరకు భారత బాక్సింగ్ సమాఖ్య చీఫ్ అజయ్ సింగ్, ఐబీఏ అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సారి టోర్నీ ఓవరాల్ ప్రైజ్ మనీ 19.50 కోట్లకు పెంచగా, స్వర్ణం విజేతకు 81 లక్షలు దక్కనున్నాయి. కాగా, ఈ మెగా ఈవెంట్ భారత్ లో జరగడం ఇది మూడోసారి.