కాశ్మీర్ లోని దోడా జిల్లాలో హీటర్లు, గీజర్ల అమ్మకాలపై ఆంక్షలు విధించారు. కరెంటు బిల్లు చూపిస్తేనే వీటిని విక్రయించాలని దుకాణాలకు కలెర్టర్ ఆదేశాలు జారీ చేశారు. కశ్మీర్ లో చలికాలం వచ్చిందంటే కరెంట్ వాడకం విపరీతంగా పెరిగిపోతుంది. వచ్చే డిమాండ్ కు సరిపడా కరెంట్ సప్లై చేయలేక కోతలు విధిస్తుంటారు. పైగా వాడకమేమో ఎక్కువ, వసూలయ్యే బిల్లులేమో తక్కువ. దీంతో విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు ఈ రూల్ తీసుకొచ్చారు.