ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా కిడ్నీల వైఫల్యంతో బాధపడుతున్నారు. లాలూ రెండో కుమార్తె రోహిణి ఒక కిడ్నీ తండ్రికి ఇచ్చి కాపాడుకునేందుకు సిద్ధమైందని సమాచారం. దీనికి తొలుత లాలూ యాదవ్ అంగీకరించలేదు, కానీ రోహిణి తన తండ్రిని ఒప్పించినట్టు తెలిసింది. ఈ నెల 20-24 మధ్య లాలూ సింగపూర్ కు వెళ్లనున్నారు. అక్కడ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ చేయనున్నట్టు సమాచారం.