అరుణాచల్ ప్రదేశ్‌లోని పశ్చిమ సియాంగ్‌లో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.7గా భూకంపం నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది. మరోవైపు హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఎప్పుడు సంభవిస్తుందో ఖచ్చితంగా చెప్పలేమని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీకి చెందిన సీనియర్ జియోఫిజిసిస్ట్ అజయ్ పాల్ పేర్కొన్నారు.