బద్వేలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, అడా ఛైర్మన్ సింగసాని గురుమోహన్ తాడేపల్లి లో బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ కి సంబంధించిన పలు అంశాలను గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని, సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. అడా ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను కూడా తెలియజేశానని ఈ సందర్భంగా గురు మోహన్ తెలిపారు. అర్బన్ డెవలప్మెంట్ సొసైటీని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి సూచించారని, తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.