రూ.15వేల కోట్లకు మించిన కేంద్ర పథకాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ప్రధాని చేతుల మీదుగా శుక్రవారం జరగనున్నాయని బీజేపీ జాతీయ కార్యదర్శి పురంధేశ్వరి అన్నారు. గురువారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ అభివృద్ధి పనుల కోసం వస్తుంటే జగన్ సర్కారు మాత్రం ప్రధాని పర్యటన పేరిట కూల్చివేతలు సాగిస్తోందన్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా, టైము ఇవ్వకుండా పేదల ఇళ్లు, షాపులు కూల్చేస్తోందని విమర్శించారు. మరి భూకబ్జాలు చేసిన వారిమీద ఎందుకు అలా చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. ఈ విధ్వంసానికి బెదిరిపోయి రాష్ట్రంలోకి పెట్టుబడిదార్లు రావటం లేదన్నారు. దిల్లీ లిక్కర్ స్కాములో అరెస్టయిన వారు ఎవరికి దగ్గరవారు? శరత్ చంద్రారెడ్డి ఎవరి మనిషి? అరవిందో ఎవరిది? అని నిలదీశారు.