అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ అమెరికన్ యువతికి అరుదైన గౌరవం లభించింది. ఇల్లినాయిస్ రాష్ట్ర చట్ట సభ ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ నుంచి పోటీ చేసిన నబీలా సయ్యద్ విజయం సాధించారు. నబీలా 23 ఏళ్లకే చట్ట సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తుల్లో ఆమెనే పిన్నవయస్కురాలు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో నబీలాకు 52.3% ఓట్లు వచ్చాయి.