చేనేత పరిశ్రమను, కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని చేనేత ఐక్యవేదిక జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున కోరారు. గురవారం స్థానిక గంగోత్రి కళ్యాణమండపంలో నిర్వహిచిన అభినందన సభలో ఆయన మాట్లాడుతూ చేనేత వస్త్రాల వాడకాన్ని పెంచి చేనేతను కా పాడా లని పిలుపు నిచ్చారు. చేనేత కార్మికుల పరిస్థితుల ప్రభావంతో ఇల్లు గడవడం కూడా కష్టతరంగా మారిందన్నారు. ప్రభుత్వం విరివిగా సబ్సిడీ రుణాలను, సంక్షేమ పథకాల ను అందిజేసి చేనేత కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శింగప్ప, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాజు, రాయలసీ ప్రచార కార్యదర్శి వెంకటరమణ, రామచంద్ర య్య, సెరేష్, జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లె రమేష్, జయరాం, మడక గంగాధర్, వరదరా జులు, బాబు, శ్రీనివాసులు, రామదాసు, నాగేశ్వరరావు, ఆంజనేయులు పాల్గొన్నారు.