చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఆ దేశంలో తాజాగా ఒక్కరోజే 10 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా ప్రభుత్వం దేశవ్యాప్తంగా కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. పలు నగరాల్లో లాక్ డౌన్ ను విధించారు. చైనా రాజధాని బీజింగ్ లో కొత్తగా 118 కేసులు నమోదయ్యాయి. ఆ నగరంలో అన్ని పార్కులను మూసివేశారు. దుకాణాలు, రెస్టారెంట్లు మూసివేశారు. విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.