రేపల్లె రూరల్ మండలం వడ్డివారి పాలెం గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందో ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్క పథకాన్ని గురించి అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ప్రజలను పలకరించారు. మోపిదేవి వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.