ఎసిడిటీ సమస్యతో చాలామంది తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ఎసిడిటీ ఉన్నవారికి ఛాతీలోను, గొంతులోను, గుండెల్లోనూ, జీర్ణాశయంలోనూ మంటగా వుంటుంది. అయితే కొన్ని మార్పుల ద్వారా కొంతమేరకు దీని ఉపశమనం పొందవచ్చు. మద్యం, పొగ, గుట్కా వంటి వాటిని పూర్తిగా మానివెయ్యాలి. మసాలాలతో కూడిన ఆహారాన్ని తగ్గించి, సమయానికి భోజనం తీసుకోవాలి. మానసిక ఆందోళనను తగ్గించుకొని, తగినంత విశ్రాంతి తీసుకోవాలి.