పాక్ భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ లో తెహ్రీక్- ఎ- తాలిబన్ కు చెందిన ఒబైద్ అలియాస్ మొహమూద్ అనే ఉగ్రవాది హతమయ్యాడు. మర్దాన్ జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ అధికారి ఫరీద్ ఖాన్ ఆయన ఇంటి ముందే హత్యకు గురవ్వగా, ఈ ఘటనలో ఒబైద్ ప్రమేయం ఉన్నట్టు సమాచారం. అనేక ఉగ్రదాడుల్లోనూ పాల్గొన్న ఒబైద్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా పోలీసుల రికార్డులకెక్కాడు. దీంతో ప్రభుత్వం అతని తలపై 50 లక్షల రివార్డు ప్రకటించింది.