ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలోని రామగిరి అటవీ ప్రాంతంలో 20 మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో BSF & SOG జవాన్లు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. భద్రతా దళాలకు, మావోలకు ఎదురుకాల్పులు జరగగా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలం నుంచి 1 టిఫిన్ బాంబు, 3 దేశీయ తుపాకులు, 5 డిటోనేటర్లు, మావోయిస్టు యూనిఫాంలు, 10 ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సౌత్ రేంజ్ డీజీపీ రాజేశ్ పండిట్ వెల్లడించారు.